HomeBooksSwapnajeevi Novel
తెSwapnajeevi Novel

Swapnajeevi Novel

by V.R.Rasani2022180 pagesAnvikshiki Books

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

180

TE

Year

2022

DESCRIPTION

మనిషి మనసులోని అంతః ప్రపంచాన్ని వ్యక్తీకరించే మార్గాలలో కళ కూడా ఒకటి. భాష వ్యక్తీకరించలేని భావాలకు సైతం రూపాన్ని కలిగించేది కళ. ఒక జాతి సంస్కృతికి శక్తిని, ఐక్యతను చేకూర్చేదీ, ఒక జీవితాన్ని ఉన్నత స్థితికి చేర్చగలిగేదీ కళే. కళాకారుడు ఎప్పుడూ కళకోసం, తద్వారా సామాజిక ప్రయోజనంకోసం పరితపిస్తుంటాడు. అందుకే కళాకారుడి మనసు సున్నితంగా వుండి, వ్యాకులతకు గురవుతూ వుంటుంది. మనసులోని సంఘర్షణను చిత్రించే మనో విశ్లేషణాత్మక రచనలు చాలా తక్కువ. అందునా కళాకారుల అంతఃసంఘర్షణను చిత్రించిన కథలు అరుదే. అలాంటి అరుదైన, విశిష్ట రచన ప్రసిద్ధ , రచయిత డా|| వి.ఆర్. రాసాని రాసిన 'స్వప్నజీవి'. మనకు జరిగిందే కథ కాదు. మనసులో జరిగేది కథే. మనిషి యొక్క భౌతిక జీవితంలో ఎదురయ్యే అనేక అనుభవాలు, అనుభూతులు, కోరికలు మెదడు పొరల్లో నిక్షిప్తమైవుండి, అనేక ప్రతీకల రూపంలోకి మారి కలల్లో దర్శనమిస్తుంటాయి. స్వప్న జగత్తులో జరిగే ఇలాంటి మానసిక సంబంధమైన అలజడికి గురై, మనసు చెదరి భ్రమల లోకంలో పడిపోయి, ఎన్నో బాధలననుభవిస్తూ బతికిన ఒక 'కళాకారుడి జీవితాన్ని పాఠకుణ్ణి ఊపిరి పీల్చుకోనివ్వక ఉక్కిరి బిక్కిరిచేస్తూ చదివించగలిగే విధంగా చిత్రించిన విశిష్ట నవల 'స్వప్నజీవి'. చివరన కొన్ని సన్నివేశాలు, దృశ్యాలు 1621లో పీటర్ పాల్ రూబెన్స్ చిత్రించిన 'రోమన్ చారిటి' పెయింటింగ్ లా, డావిన్సీ 'మోనాలిసా' చిత్రంలా... చదువరి మెదడులోనేగాక, నవలా సాహిత్యంలో నిలువెత్తు చిత్రపటంలా నిలచి పోతాయనడంలో సందేహం లేదు. అందుకే చిత్ర కళారంగంలోను, మనో విశ్లేషణాత్మక సృజనలోను 'A well researched novel' గా నిలిచి పోతుంది 'స్వప్నజీవి'. ఇన్ని కారణాలవల్ల ప్రతి తెలుగువాడూ చదవదగిందీ, దాచుకోదగిందీ ఈ 'స్వప్నజీవి'.

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2022.

Details

Language
te
Year
2022
Pages
180
Publisher
Anvikshiki Books

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.