Rating
—
0 votes
Reviews
0
reader takes
Pages
80
TE
Year
2025
—
DESCRIPTION
ముందుమాట మాయావతి (చమార్) మాదిగ కులంనకు చెందిన వ్యక్తి. మాయావతి చిన్నప్పటి నుంచే సామాజిక వివక్షతకు గురయ్యారు. చదవడమే కాకుండా అణగారిన అట్టడుగు వర్గాలు మనదేశంలో చాలాహీనమైన పరిస్థితిలో ఉన్నారని తెలుసుకుని వాటిని తొలగించేందుకు రాజకీయంగా ఉద్యమాలు నిర్వహించాలని ఆమె యుక్త వయస్సులోనే దృఢమైన అభిప్రాయానికి వచ్చారు. దళిత వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాంతం ఉద్యమించాలని ఆనాడే తీర్మానించారు. వివాహం కూడా చేసుకోకుండా అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆమె ఉద్యమాలకు ప్రాధాన్యతనిచ్చారు. 1977 నుంచి 1984 వరకూ ఆమె వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పని చేశారు. 1984లో ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఈ దశలో ఆమెకు అప్పటికి దళిత నాయకుడిగా దేశవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న కాన్షీరాంతో పరిచయమేర్పడింది. ఇరువురూ తమ తొలి సమావేశంలోనే తమ లక్ష్యాలు, గమ్యాలు ఒక్కటేయని తెలుసుకున్నారు. ఐ.ఏ.ఎస్లను నియంత్రించే అధికారం రాజకీయాలల్లో చేరి మంచి పదవులు చేపడుతే వస్తుందని కాన్షీరామ్ ఉపదేశించడంతో మాయావతి బాట కొత్త మలుపు తిరిగింది. కాన్షీరామ్ మాటలను విశ్వసించి, ఆమె కాన్షీరామ్న తన గురువుగా భావించారు. కాన్షీరామ్ నేతృత్వంలో బి.యస్.పి. నిర్వహించిన ఉద్యమాలలో మాయావతి చురుగ్గా పాల్గొన్నారు. దళితులు, వెనుకబడిన వర్గాల వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఆ వర్గాల వారికి తిరుగులేని నేత అయ్యారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ చింతన కాన్షీరామ్ భావాలు ఆమెను అమితంగా ప్రభావితం చేశాయి. ఉత్తరప్రదేశ్లో ఒక అబ్బురం, ఒక ఆశ్చర్యం జరిగింది. ఇది సామాన్యమైనది కాదు. 4 వేల సం||ల భారతదేశ చరిత్రలో కనీ విని ఎరుగనిది. "నస్త్రీ స్వాతంత్య్ర మర్హతి” అన్న నానుడికి కాలం చెల్లింది." "ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పించినన్”. దేశంలోని పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో మొదటిసారిగా ఒక చమార్....................
AUTHOR1 author
CREW2 people
CREATIVE CONTRIBUTORS
Printing & Publishing
Trivia
- ▸Trivia. This edition credits 2 people across 2 roles.
- ▸Released. First cataloged for the year 2025.
Details
- Language
- te
- Year
- 2025
- Pages
- 80
- Publisher
- Bhoomi Book Trust
Reviews0 reviews
Loading reviews…
More like this

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan

Praja Gaanam

Nitin Gadkari Avadhululeni Alochanaparudu

