HomeBooksSubhalakshmi Managalaswaram - A Novelette
తెSubhalakshmi Managalaswaram - A Novelette

Subhalakshmi Managalaswaram - A Novelette

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

100

TE

Year

2025

ISBN listed

DESCRIPTION

ఎం.ఎస్. శుభలక్ష్మి... మంగళ స్వరం. శుభలక్ష్మిదేవి.... సరిగా నిదురించలేదు, సరిగా మాట్లాడలేదు, సరిగా తినలేదు... సరిగా జీవించలేదు... స రి గా... సా... రి గా... రి గా... తప్ప సరిగ్గా ఆవిడ జీవితంలో ఏమీ చెయ్యలేకుండాపోయింది. సరిగ్గా స, రి, గా, కూడా పాడలేదంటుంది... ** * "మీకు సోలోగా పాడటం ఇష్టమా? డ్యూయెట్ అంటే ఇష్టమా?” కొంచెం మూడ్‍ని మారుస్తూ... Solo అంటే ఇష్టం. అది So-lowలో ఉన్నప్పుడు చాలా బాగుంటుంది Duet అంటేనూ ఇష్టం. Do-it అని ప్రేరణ కలిగిస్తుంది. అసలు పాడటమే నాకు ఇష్టం... సంగీతంలో సాధన, శ్వాస ఆగే వరకూ చేయడం అంటే నిత్యం పాటలోనే పరితపించడం కదా!" "మీరు బాగా పాడానని, అన్ని కచ్చేరీల్లోనూ భావిస్తారా? ఒక్కసారి తడబడ్డానని, చెడగొట్టానని బాధపడిన సందర్భాలున్నాయా?" "అన్నీ ఉంటాయి. కానీ ఏదీ స్పృహలో జరగదు. సంగీత కళ నేర్చుకోవడానికి పుట్టాను గాని, సంగీత నేర్పరి కావాలని కలకనను. నేను పొరపాటున కూడా పాటని చెడగొట్టాలనే ధైర్యం ఛస్తే చెయ్యను, చెయ్యలేను.” “కానీ కొన్ని సందర్భాల్లో పొరపాట్లు జరుగుతాయి. అది నా ఎరికలోకి వచ్చినప్పుడు, మా అమ్మానాన్నల ఫోటో ముందు కూర్చొని, కచ్చేరీ మళ్ళీ మొదట్నుంచీ పాడతాను.” "మీకు వేయి రాగాలు వచ్చా? ఒక రాగాన్ని వేయి రకాలుగా ఆలపించడం వచ్చా?” "రెండూ రావు. అది ఆ త్యాగరాజులకే సాధ్యం అయ్యింది, పురంధరుడికే దక్కింది. ఎందుకంటే కృష్ణానదీ తీరాన పది ఎకరాల స్థలం కొనడం కోసం వాళ్ళు రాగాలాపన చేయలేదు. స్వంత విమానంలో విహారం చేయాలని సంగీత కచ్చేరీలు చేయలేదు. ఎందరో మహానుభావులు ఒక రాగాన్ని లక్షణంగా, లక్ష విధానాలుగా, లక్షల హృదయ స్పందనగా పాడారు,” అంది కోమల స్వరంతో.

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
100
ISBN
9789348912008
Publisher
Anvikshiki Publishers

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.