Rating
—
0 votes
Reviews
0
reader takes
Pages
131
TE
Year
2025
—
DESCRIPTION
పవన్ అప్పుడే ఆఫీసులోకి అడుగుపెట్టాడు. కరెంటుకోత మొదలైపోయినట్టుంది. ముందరి హాలులో ఛార్జింగ్ లైటు వెలుగుతోంది. ఆ కొద్ది వెలుతురులోనే తడుముకుంటూ పవన్ తన కేబిన్ దగ్గరకి చేరుకున్నాడు. ఆ చీకట్లో టేబుల్ మీద ఉన్న కంప్యూటర్ నీడ విరగబడి నవ్వుతున్న 'లాఫింగ్ బుద్ధ' బొమ్మని తలపిస్తోంది. ఫోను, ఇంటర్ కమ్ అన్నీ నిర్జీవంగా పడి ఉన్నాయి. కరెంటు లేకపోతే అసలు మొత్తం ప్రపంచమే స్పృహతప్పి పడిపోయినట్టు ఉంది. కరెంటు ఊంటే ఈ చిన్న గదే అతని సామ్రాజ్యం. కొద్దిసేపటికి కళ్ళు చీకటికి అలవాటు పడంటంతో మౌస్ కనబడింది. అయితే అది కూడా కదలకుండా నిర్జీవంగా పడిఉంది. పవన్ పెదవుల మీద చిన్న చిరునవ్వు మెరిసింది - పేరుకు ఎలక. కానీ ఏం లాభం? ఎలాంటి చలనం లేకుండా పడి ఉంది... కరెంటు లేకపోతే ఇదొక చిన్న ప్లాస్టిక్ బొమ్మే. "ఓ ఎలకా! ఎమన్నా మాట్లాడు. కుయ్ కయ్ ఏదో ఒకటి అను కదా...!” అయినా ఎలకలో ఎలాంటి చలనం లేదు. ఉన్నట్టుండి పవనికి తన తమ్ముడు చందు గుర్తొచ్చాడు. అమ్మ వంటింట్లో డబ్బాలో దాచిన బిస్కెట్ల కోసం చిన్నప్పుడు అన్నదమ్ములిద్దరూ రాత్రిళ్ళు వంటింట్లోకి దూరేవారు. వంటింట్లో ఎప్పుడూ పెద్ద పెద్ద ఎలకలు అటూ-ఇటూ పరిగెడుతూ ఉండేవి. ఆ ఎలకలంటే అన్నదమ్ములిద్దరికీ చచ్చేంత భయం. వంటింటి తలుపు తీసి అగ్గిపుల్ల గీస్తూ చందు మ్యావ్ మ్యావ్ అని అరుస్తూ ముందుకు నడచుకుంటూ వెళ్ళేవాడు. అలా పిల్లిలా అరిస్తుంటే వంటింట్లోకి పిల్లి వచ్చిందని భయపడి ఎలకలు పారిపోతాయని వాడి ఆలోచన. వాడు పుట్టింది కూడా మార్జాల గణంలోనే మరి......................
AUTHOR1 author
CREW2 people
CREATIVE CONTRIBUTORS
Printing & Publishing
Trivia
- ▸Trivia. This edition credits 2 people across 2 roles.
- ▸Released. First cataloged for the year 2025.
Details
- Language
- te
- Year
- 2025
- Pages
- 131
- Publisher
- Ennela Pitta
Reviews0 reviews
Loading reviews…
More like this

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan

Praja Gaanam

