HomeBooksOo Karma Yogi Jeevitam
తెOo Karma Yogi Jeevitam

Oo Karma Yogi Jeevitam

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

385

TE

Year

2026

DESCRIPTION

మా బళ్ళారి మా బళ్ళారి భారత దేశపు దక్షిణ దిశన వున్న ఒక పట్నం. నేను పుట్టింది అక్కడే. అది అలనాటి రాయలు వారు పాలించిన విజయనగర సామ్రాజ్యానికి చెందినది. అక్కడే కొండపైన 250 మీటర్ల ఎత్తుకు మించిన ఏక శిలలా కనిపిస్తున్న రాతిస్థావరం పైన ఒక అద్భుతమైన కోట, కోటకు దిగువన ఎత్తైన ప్రహరీ గోడ. ఆ గోడ చుట్టూ లోతైన నీటి కందకం, అది శత్రుసేనల నుండి రక్షణ కోసం. అంత పెద్ద కొండచుట్టూ కందకం నిండేంత నీటి వసతి ఎలా కలిగిందో విచిత్రం. కోట లోపల విశాలమైన రాజమార్గం. రాయలసీమగా ప్రసిద్ధి చెందినదే మా బళ్ళారి! మొగలాయిల దాడులతో అది కుతుబ్ షాహీ కైవశమైంది. క్రమేణ దానిని నిజాం నవాబు అసిఫ్ జాహి కులస్థుడు వశపరచుకున్నాడు. అప్పటికే మొగల్ సామ్రాజ్యం హీనదశకు చేరడం, పశ్చిమదిశ నుండి మరాఠీలు విజృంభించడంతో నిజాం భయపడ్డాడు. దారితోచక తనకు బ్రిటీష్ వారి ఆదరణ ఒక్కటే మార్గమని భావించాడు. అప్పటికే వ్యాపారం కోసం మన దేశానికి వచ్చిన బ్రిటీష్ వారు రాజులను ప్రలోభ పరిచి, రాజ్యాలను కొల్లగొట్టి, దక్షణ భారతాన మద్రాసు నగరాన్ని తమ స్థావరంగా చేసుకుని, ఈస్టిండియా కంపెనీని విస్తృత పరిచారు. వారికి గణనీయమైన ఆయుధ సంపత్తి గల బ్రిటీష్ సైన్యం అండగా వుంది. మరాఠీల రౌద్ర విజృంభణకు భయభ్రాంతుడై హైదరాబాద్ నవాబయిన నిజామ్ బ్రిటీష్ వారి ఆదరణ కోరి, అందుకు గాను తమ సికింద్రాబాద్లోని ఒక ప్రాంతాన్ని “కంటోన్ మెంట్” గా తీసుకుని అక్కడ తమ మిలటరీ స్థావరాన్ని ఏర్పాటు చేసుకోమన్నాడు. అలా తీసుకుంటే, కంటోన్మెంట్ మిలటరీ ఖర్చులన్నీ భరిస్తానని ఒప్పందం చేశాడు. తదనుగుణంగా సికింద్రాబాద్లో కంటోన్మెంట్ను బ్రిటీష్ వారు స్వాధీనపరచుకున్నారు. పిదప కంటోన్మెంటులోని బ్రిటీష్ మిలటరీ ఖర్చులు భరించలేక, బకాయిలు పడి, కడకు 1800 లో తన ఆధీనంలోని బళ్ళారి, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలైన రాయల సీమను ఈస్టిండియా కంపెనీకి వశపరిచాడు నవాబు! వశపరచుకున్న బ్రిటీష్ వారు బళ్ళారిని ఆ నాలుగు జిల్లాలకు ప్రధాన కేంద్రంగా చేసి, థామస్ మన్రోను బళ్ళారి కలెక్టర్ గా నియమించారు. అటు పిమ్మట ఆయనను అనంతపురంకు మార్చారు. ఆయన రైతులకు వారి వారి భూముల మీద హక్కులను, కలిగించారు!. ఇది రాయలసీమ వాసులకు సంతోషం కలిగించింది. తద్వారా బ్రిటీష్ వారికి భూమి శిస్తు లేదా తాహశీలు ద్వారా రాబడి, అలాగే వారు చేసిన చట్టాల ద్వారా హక్కులు, లావాదేవీలు, న్యాయస్థానలు కూడా అమల్లోకి వచ్చాయి. పశ్చిమ దిశలో మరాఠీల రాజ్య విస్తరణ జరిగింది. అది కూడా బ్రిటీష్ వారి గమనానికి వచ్చింది. హైదరాబాద్ నవాబు నుండి కైవసమయిన రాయలసీమలోని బళ్ళారిలో 1820లో బ్రిటీష్ వారు మిలటరీ స్థావరాన్ని ఏర్పాటు చేశారు. అది వారి కంటోన్మెంట్. అక్కడ బ్రిటీష్ సాయుధ బలగాలతో పాటు రెండు భారతీయ సైనిక పటాలాలకు చోటు కల్పించారు. దానిని మద్రాస్.............................

Autobiography and Biography

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2026.

Details

Language
te
Year
2026
Pages
385
Publisher
Sahithi Prachuranalu

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.