HomeBooksNiyam Puram
తెNiyam Puram

Niyam Puram

by Raja Narasimha2024350 pagesAnvikshiki Publishers

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

350

TE

Year

2024

ISBN listed

DESCRIPTION

రాజా నరసింహ తన నియాంపురం నవల ద్వారా కోదు జీవితాన్నీ, వారి పోరాటాన్నీ ఒక సరికొత్త ప్రాసంగికతతో మనముందు చూపిస్తున్నాడు. గోపీనాథ మొహంతి నవల "అమృత సంతానం" లానే ఈ నవల కూడా గిరిజన జీవితాన్ని ఐతిహాసిక ప్రమాణాల్తో చిత్రించడానికి ప్రయత్నించింది. పుట్టుక, పెళ్ళి, చావు, పూజ, బలి, వియ్యం, కయ్యం - ఒక సమాజాన్ని చిత్రించడానికి అవసరమైన ఏ ఒక్క పార్శ్వాన్నీ రచయిత విడిచిపెట్టలేదు. గిరిజన జీవితంలో ఏడాది పొడుగునా నడిచే క్రతుకాండ, సంబరాలు, ఉత్సాహం, వేడుకలు వేటినీ రచయిత వదల్లేదు. సంతలు, దోపిడీ, వడ్డీ, వెట్టి, అణచివేత, తిరుగుబాటు- గిరిజన జీవితాన్ని ప్రతిబింబించే ఏ సందర్భాన్నీ రచయిత పక్కన పెట్టలేదు. చివరికి తాను కళ్ళతో చూసినదాన్ని పూర్తిగా తిరగమార్చి తప్పుడు కథనాలు రాసి పంపించే విలేకరితో సహా గిరిజన ప్రాంతంలో మనకి కనబడేవాడేవడూ ఇందులో కనబడకుండాపోడు. తాను ఏ డోంగ్రియా కోదు జీవితాన్ని వర్ణిస్తున్నాడో ఆ ఆదివాసుల్ని ఈ రచయిత చాలా దగ్గరగా చూసాడనీ, చాలాచోట్ల వారితో మమేకమయ్యాడనీ, వారిని మాత్రమే కాదు, వారి దేవతల్ని కూడా దగ్గరగా చూసాడనీ ఈ నవల సాక్ష్యం చెప్తున్నది. గిరిజన సంస్కృతిపట్ల లోతైన అవగాహన ఉన్న ఒక రచయిత రాసిన నవల కాబట్టే ఇన్నాళ్ళకు తెలుగులో ఒక పూర్తిస్థాయి గిరిజన నవల వచ్చిందని అనిపిస్తున్నది నాకు. వాడ్రేవు చినవీరభద్రుడు

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
350
ISBN
9789395117449
Publisher
Anvikshiki Publishers

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.