Rating
—
0 votes
Reviews
0
reader takes
Pages
136
TE
Year
2026
—
DESCRIPTION
మృతనగరంలో - చిత్రకొండ గంగాధర్ శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరభ్రహ్మేంద్రస్వామి గారు భవిష్యత్తు కలియుగంలో జరగబోయే వింతలు, విశేషాలు, వైపరీత్యాలను దృష్టిలో ఉంచుకుని ఏనాడో కాలజ్ఞానం రచించారు. ఇన్ని వందల సంవత్సరాల తరవాత లోకంలో ఎటువంటి వింతజరిగినా, ఎంతటి ప్రకృతివైపరీత్యం జరిగినా మనం బ్రహ్మం గారిని తలుచుకుంటున్నాం. ఆయన చెప్పినవి జరుగుతుండటం చూసి ఆశ్చర్యపోతున్నాం. గత ఆరునెలలుగా కరోనా వైరస్ మూలంగా ప్రపంచం మొత్తం తలకిందులవుతూ ఉంది. దాదాపు ప్రతీ దేశం, ప్రతి నగరం, ఊరూ వాడా జనమంతా కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తూ ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ మూలాన జనసమ్మర్థంగా ఉండే నగరాలు, పట్టణాలు ఊళ్లు నిర్మానుష్యమయ్యాయి. నెలల తరబడి జనం ఇళ్లలోనే తలదాచుకుంటున్నారు. నగరాలే కాదు, వీథులకి వీధులు, ప్రపంచం నలుమూలలు, చిట్టచివరి చిన్న గల్లీ కూడా నిర్మానుష్యం కావడం మనం కళ్లారా చూసాం. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో సామూహిక ఖననాలు జరిగాయి. ఇది 2020 సంవత్సరంలో వచ్చిన ఒక పెను ఉపద్రవం. మానవజాతి చరిత్రలో మహా పెను ఉప్పెన. ఇలా మనుషులు మాయం కావడం గురించి, నగరాలు ఖాళీ అవడం గురించి ఇరవై సంవత్సరాల పూర్వం తెలుగులో చిత్రకొండ గంగాధర్ అనే కవి, రచయిత 2000 సంవత్సరానికి పూర్వమే 'మృతనగరంలో' అన్న గొప్ప నవల రాసాడు. చదవడానికి ఇదొక కవితాత్మక ఆత్మకథ. గ్రీకు పురాణగాధలని ఇష్టపడే ఈ రచయిత ఇకారస్ అనే పాత్రని తీసుకుని తాను ఆ పాత్రద్వారా ఒక నిర్మానుష్య నగరంలో సంచరిస్తున్నట్లు రాయడం ఈ నవల విశేషం. అయితే కేవలం మనుషులు లేని ప్రపంచాన్ని చూపించడమేనా ఈ రచయిత ప్రత్యేకత? నవల చదువుతున్నంతసేపూ అదొక నేపథ్యంగానే మనం చూడాల్సి ఉంటుంది. నవలలో పెద్ద దారుశిల్పం ఉంటుంది. అదొక స్త్రీ నగ్న స్వరూపంలో ఉండే దారుశిల్పం. మనుషులు తాడు నిచ్చెన సహాయంతో అందులోకి ఆ విగ్రహం పైకి ఎక్కి లోపలకు దిగొచ్చు. లోపల అంతా మళ్ళీ మన మామూలు ఇళ్ల మాదిరిగానే ఉంటుంది. చిత్రకొండ గంగాధర్ అనే ఈ రచయిత ఈ దారుశిల్పాన్ని మానవ మనస్తత్వానికి, అధికారానికి, కౌటుంబిక జీవనానికి ప్రతీకగా, ఒక మెటాఫర్ గా వాడాడని మనకు అర్థమౌతుంది. ఈ దారుశిల్పానికి చేతులు ఉండవు. తలా ఉండదు. గ్రీకులు ట్రాయ్ నగరాన్ని ముట్టడించడానికి చెక్కతో చేసిన గుర్రాన్ని తయారు చేసుకున్నారు. అదొక యుద్ధతంత్రం. మనకు ఈ మృతనగరంలో కనిపించే దారుశిల్పం కూడా అటువంటి "ట్రోజన్ హార్స్ ' లాంటిదే. మనుషులు అవతలివారిని ఓడించడానికి అందులో దాక్కుని చేసే యుద్ధం. అదొక మోసం కూడా. అవతలి వారిని ఓడించడానికి, ఆధిపత్యాన్ని చూపడానికి, అధికారాన్ని ప్రదర్శించడానికి ప్రతి మనిషి ఆ స్త్రీ నగ్న రూపంలాంటి ఒక దారుశిల్పాన్ని తయారుచేసుకుంటాడు. అందులో దూరి తన అధికారాన్ని చలాయిస్తుంటాడు. అది అహం కూడా కావొచ్చు. అదొక బలమైన వాంఛ. మనుషులు తమ అంతరంగంలో కట్టుకున్న ఈ నిర్మాణాన్ని ధ్వంసం చేయడానికే చిత్రకొండ గంగాధర్ ఈ దారుశిల్పాన్ని సృష్టించాడని మనకు అర్థమౌతుంది. నవల చివరలో వచ్చే మహాప్రళయంలో ఈ దారుశిల్పం కూలిపోవడం కూడా మనం చూస్తాం. ఆరకంగా ఇందులో కనిపించే ఈ దారుశిల్పం అనేక మనుషుల ఆంతరంగిక నిర్మాణాలకు ప్రతీకగా నాకు అనిపించింది. ఇకపొతే ఇకారస్ నిర్మానుష్య నగరంలో చేసే ప్రయాణంలో 'ఎడ్వర్డ్ ' అనే స్నేహితుడు, 'స్ట్రోకర్' అనే గ్రహాంతరవాసి కలుస్తారు. కొన్నిసార్లు వాళ్ళిద్దరు ఇకారస్ కు ప్రతిరూపాలుగా కూడా కనిపిస్తారు. వాళ్లు చేసే ప్రయాణంలో, వాళ్ళ సంభాషణల్లో, ఇకారస్ అంతరంగంలో అతడి బాల్యం, అతడి భయాలు, జ్ఞాపకాలు చటుక్కున కనిపిస్తూ మాయమౌతుంటాయి. వాటికి మొదలూ చివరా ఉండదు. కాళ్లకు పట్టీలు కట్టుకున్న ఎవరో ఒక యువతి, తల్లి, తల్లి చీర కట్టుకున్న ఎవరో తల కనిపించని స్త్రీ, చిన్నపి
AUTHOR1 author
CREW2 people
CREATIVE CONTRIBUTORS
Printing & Publishing
Trivia
- ▸Trivia. This edition credits 2 people across 2 roles.
- ▸Released. First cataloged for the year 2026.
Details
- Language
- te
- Year
- 2026
- Pages
- 136
- Publisher
- Aju Publications
Reviews0 reviews
Loading reviews…
More like this

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan

Praja Gaanam

