HomeBooksKalavaralu Kalaravalu
తెKalavaralu Kalaravalu

Kalavaralu Kalaravalu

by Vaaranasi Nagalakshmi2024144 pagesAnvikshiki Books

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

144

TE

Year

2024

ISBN listed

DESCRIPTION

వారణాసి నాగలక్ష్మి రాసిన ఈ కవిత్వాన్ని చదివినప్పుడు - చుట్టూ ఏం జరుగుతోందో, ఏం లోపించిందో, హాయిగా ఉండటానికి ఏవి ఏవి అడ్డంగా ఉన్నాయో తెలుస్తుంది. నిత్య చలనశీల అయిన ప్రకృతిని నాగలక్ష్మిగారు అమితంగా ప్రేమిస్తారు. ఈమె కథకురాలు, కవి, చిత్రకారిణి. పిల్లలపట్ల ఆమెకున్న ప్రేమ అమోఘమయినది. పశులగాసే పిల్లవాడి పాట ఎలా పరివ్యాప్త మవుతుందో అద్భుతంగా వర్ణించారు. ప్రకృతికి సంబంధించిన ఏ కవితయినా అద్భుతంగా తీర్చిదిద్దారు. స్త్రీ సహజాతమయిన కరుణ, ప్రేమ, వేదన, ఎదురుచూపు, భూమాతంత విశాలమయిన ఓర్పు - అన్నిటినీ కలబోసి అందించారిందులో. మొత్తం కవిత్వంలో విశిష్టంగా కనపడేది ఈ మానవీయ స్పర్శే. - కె. శివారెడ్డి ఈ సంపుటిలోని కవితలన్నిటిలోనూ ఒక నిరీక్షణ ఉంది. ఆ ఎదురుచూపు తన సంతోషం కోసం కాదు. తన చుట్టూ ఉన్న మనుషులు, పల్లె, నగరం, ప్రకృతి, పర్యావరణం ప్రతి ఒక్కటీ కలకల్లాడుతూ ఉండే రోజు కోసం. అలా ఎదురుచూడకపోయినా తన జీవితంలో ఆమెకేమీ లోటు లేకపోవచ్చు. కాని అలా ఎదురుచూడకుండా ఉండలేకపోవడమే ఆమెని కవయిత్రిని చేసింది. కవిత అంటే మనసులో మాట. ఆ మాట ఎంత సూటిగా, ఎంత తేటగా ఉంటే, వినేవాళ్ళ హృదయాలు అంతమెత్తనవుతాయి. ఈ పుటల్లో ప్రయాణిస్తున్నంతసేపూ మనం కూడా కొంతసేపేనా మనలోని మానవత్వానికి దగ్గరగా జరుగుతాం. ఈమె చేసిందల్లా తన మనసులో మాట మనతో పంచుకోవడం. మనుషులు ఇప్పుడున్నట్లుగా ఇంత దయనీయంగా, ఇంత దుర్మార్గంగా బతక్కుండా మనుషుల్లాగా బతికితే బాగుణ్ణని కోరుకోవడం. ఆ కోరిక ఎంత నిర్మలమైందంటే ఈ కవితలు చదివిన చాలా సేపటిదాకా ఆ శుభ్రత మన మనసుల్ని అంటిపెట్టుకునే ఉంటుంది. - వాడ్రేవు చినవీరభద్రుడు

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
144
ISBN
9789395117661
Publisher
Anvikshiki Books

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.