Rating
—
0 votes
Reviews
0
reader takes
Pages
125
TE
Year
2026
ISBN listed
DESCRIPTION
సీమమట్టిని తడిపిన ‘కన్నీటిమేఘం’: మారుతీ పౌరోహితం కథాసంపుటి రాయలసీమ ప్రాంతపు భాషా పరిమళాలను వెదజల్లుతూ, అక్కడి జీవనాన్ని దర్శింపజేస్తూ, గ్రామీణప్రాంత వ్యక్తుల వ్యధలను అత్యంత సన్నిహితంగా చూపిస్తాయి ఈ సంపుటిలోని మారుతి పౌరోహితం అందించిన తొమ్మిది కథలు. ఇవన్నీకూడా రచయిత అత్యంత సమీపంగా చూసిన వ్యక్తుల వాస్తవ జీవిత కథలు. ఈ రచయిత జీవిత చిత్రణతో ఆగిపోకుండా, ఆయా వ్యక్తుల జీవితాల్లో, వాళ్లెదుర్కొన్న సమస్యల్లో కలగజేసుకొని, తన వంతు సహాయ సహకారాలను అందజేసిన క్షేత్రస్థాయి కార్యకర్తకూడా కావడం విశేషం. అదే ఈ కథలకున్నజీవశక్తి. అయితే ఇవన్నీ కథలేగనుక నిజజీవిత చిత్రాలుగానే మనకు దర్శనమిస్తాయి. - ఉణుదుర్తి సుధాకర్ (రచయిత, నవలాకారుడు, విమర్శకుడు) రాయలసీమ నేలనీ, నుడినీ సాధన చేసుకొని మారుతీ పౌరోహితం, నిష్టూరభరితమైన మానవ సంబంధాల చిత్రణ చేస్తున్నాడు. పల్లెటూరి నుంచి ఎదిగివచ్చి పల్లెను మరువని తనమూ, బడిపంతులి ఆదర్శమూ కలగలిపి బడీ- చదువూ – బాల్యం అనే త్రయాన్ని అన్ని కథలకూ వనరుగా చేసుకుంటూ పాఠకులకు విభిన్నమైన అనుభవాల్ని అందిస్తున్నాడు. మన చుట్టూ దట్టంగా ద్వేషం కమ్ముకుంటున్న తరుణంలో ఓ పాకిస్తానీ ప్రవాసీ ప్రేమకథను చెప్పి మెప్పించే సాహసం కూడా చేస్తున్నాడు. తరుణ ప్రాయపు ప్రాణసమానమైన కొడుకు మరణాన్ని జీర్ణించుకుంటూ శిథిలమవుతున్న ఒక తల్లి హృదయ కంపననీ, కడుపుకోతనీ ఎంతో ఆర్ద్రంగా మన కళ్లకు కడుతున్నాడు. వెరసి, రాయలసీమ కథకు తనదైన చేర్పును అందిస్తున్నాడు. - జి. వెంకటకృష్ణ కవి, రచయిత, విమర్శకుడు.
AUTHOR1 author
CREW2 people
CREATIVE CONTRIBUTORS
Printing & Publishing
Trivia
- ▸Trivia. This edition credits 2 people across 2 roles.
- ▸Released. First cataloged for the year 2026.
Details
- Language
- te
- Year
- 2026
- Pages
- 125
- ISBN
- 9789347704383
- Publisher
- Chaaya Publications Private Limited
Reviews0 reviews
Loading reviews…
More like this

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan

Praja Gaanam

