HomeBooksDroupadi Murmu- Agnisarasulo Vikasinchina Kamalam
తెDroupadi Murmu- Agnisarasulo Vikasinchina Kamalam

Droupadi Murmu- Agnisarasulo Vikasinchina Kamalam

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

176

TE

Year

2025

DESCRIPTION

జూన్ 21. భారతదేశ గౌరవ ప్రతిష్ఠలను ప్రపంచానికి చాటి చెప్పిన రోజు. కాని 2022 జూన్ 21 భారత చరిత్రలోనే నమోదు కావలసిన ఒక ముఖ్యమైన ఘట్టం. ఆ రోజే రాష్ట్రపతి పదవికి ఒక ఆదివాసీ మహిళను నిలబెట్టనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలోని నేషనల్ డెమాక్రటిక్ అలయెన్స్ ప్రకటించింది. ఆమె పేరు అప్పటివరకూ ఎంతోమందికి పెద్దగా తెలియదు. కాని ఆ రోజు నుంచీ ఆమె పేరు దేశంలోనే కాదు, ప్రపంచమంతా మారుమోగిపోయింది. ఆమె ద్రౌపది ముర్ము. ఒడిసాలోని ఉపర్బేడాలోని రాయరంగపూర్ గ్రామస్థులు తమ గ్రామంలో పుట్టి పెరిగిన ఒక మహిళ దేశ రాష్ట్రపతి కాబోతున్నారని తెలిసి ఆనందాతిరేకంతో నృత్యం చేశారు. ఆమె ఇంటి ముందు బాణాసంచా కాల్చారు. బాజా భజంత్రీలు మోగించారు. అది ద్రౌపది ముర్ము స్వగ్రామం. ఆమె జన్మస్థలమే కాదు, ఆమె అత్తమామల గ్రామం కూడా. అక్కడి ఆశ్రమ పాఠశాలలో జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు తమ టీవీ కెమెరాలతో సహా గుమిగూడారు. ఆమె గురించి ప్రత్యేక కథనాలు ప్రసారం చేయడం ప్రారంభించారు. ఎవరీ ద్రౌపదీ ముర్ము? ఆమె ఎక్కడి నుంచి వచ్చారు.. ఆమె నేపథ్యం ఏమిటి, ఆమె కుటుంబ వివరాలేమిటి, ఇవన్నీ వర్తమాన చరిత్రకారులైన జర్నలిస్టులు ఆరా తీస్తే అనేక ఆసక్తికరమైన విషయాలు ప్రపంచానికి వెల్లడయ్యాయి. ఆ రోజు రాత్రి రాయరంగపూర్ గ్రామస్థులు మాత్రం నిద్రపోలేదు. కానీ ఎక్కడి రాయరంగపూర్, ఎక్కడి రాష్ట్రపతి భవన్? స్వాతంత్య్రం వచ్చిన ఏడున్నర దశాబ్దాల తర్వాత ఆ గ్రామంలో జన్మించిన ఒక సంతాలీ ఆదివాసీ మహిళ దేశంలో అత్యున్నత పదవిని అధిష్ఠించడం ఎలా సాధ్యపడింది? “నేను చదువుకుంటే కటిక పేదరికంలో ఉన్న మా కుటుంబానికి అండగా ఉండవచ్చనుకున్నాను. కాని రాజకీయాల్లోకి వస్తానని కానీ, గవర్నర్ వంటి ఉన్నత పదవి లభిస్తుందని కానీ నేను ఎన్నడూ ఊహించనుకూడా లేదు..” అని 2016లో జార్ఖండ్ గవర్నర్ హోదాలో దూరదర్శనక్కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ద్రౌపది ముర్ము భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయడం స్వాతంత్య్రానంతర రాజకీయ చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం. ఎన్డీఏకు చెందిన పార్టీలే కాక, ప్రతిపక్షాలకు చెందిన శివసేన, అకాలీదళ్, బిజెడి వంటి అనేక పార్టీలు కూడా మద్దతునీయడంతో ద్రౌపది ముర్ము ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఘనవిజయం సాధించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలోని ఎన్డీఏ రాష్ట్రపతి పదవికి ఒక ఆదివాసీ మహిళను ఎంచుకోవడం వల్ల దేశంలో అనేక పార్టీలు ఆమెకు మద్దతు నీయడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ముఖ్యంగా ఒడిసాకు చెందిన ఆదివాసీ మహిళ కావడంతో ద్రౌపది మురుకు నాటి ఒడిసా ముఖ్యమంత్రి, బిజెడి నేత నవీన్ పట్నాయక్ వెంటనే మద్దతు ప్రకటించారు. ఆమెను ఒడిసా ముద్దుబిడ్డగా అభివర్ణించారు. ద్రౌపది ముర్ము ఎన్నికైన వెంటనే ఉపర్బేడాలో ఆమె గ్రామస్థులు సంబరాలలో మునిగిపోయారు. జులై 21ని వారు విజయ్ దివస్ ప్రకటించారు. రైతులు ఆ రోజు పొలం పనులకు సెలవు పెట్టి సంబరాలు జరుపుకున్నారు. ఆమె 1997లో కౌన్సిలర్గా ఉన్న రాయిరంగాపూర్లో వర్తకులు స్థానికులందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. ఇక్కడ ప్రతి సామాన్యుడూ అత్యంత ఉద్వేగాన్ని అనుభవిస్తున్నాడు ఆని ఆమె సోదరుడు తరణిసేన్ చెప్పారు.....................

Autobiography and Biography

CREW2 people

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
176
Publisher
Emasco Books pvt.L.td

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.