HomeBooksDargamitta Kathalu / Poleramma banda Kathalu
తెDargamitta Kathalu / Poleramma banda Kathalu

Dargamitta Kathalu / Poleramma banda Kathalu

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

342

TE

Year

2025

DESCRIPTION

దర్గామిట్ట కతలు పోలేరమ్మ బండ కథలు శ్రీ ఖదీర్‍బాబు గారి దర్గామిట్ట కథలతో పాటు పోలేరమ్మబండ కథలలోని పాత్రలు నాన్నలూ అమ్మలూ అవ్వలూ తాతలూ అందరూ భూలోక దేవతలు. సుఖసంతోషాలలాగే కష్టాలనూ కన్నీళ్లనూ కూడా నగలుగా వేసుకొని హుషారుగా తిరుగుతారు. పాలూ పూలూ పాపాలు తాపాలు అన్నీ ఒకటే. ఇందులో... నా పేరు పెట్టింద మీసాల సుబ్బరాజు, అలీఫ్ బే తే మా నాయినమ్మకి గోరి కడితే, మా యిస్కూలు యూనివసరీకి దుమ్ము రేపేసినా, పాపాలన్నీ మాయమ్మకేనంట, కసాబ్‍గల్లీలో బులుగా పలావెంకారెడ్డా, పండగపూట పలావు ముక్కల కథ, మా అన్నేగానీ చదివుంటే, చీదలు వంజరాలు మూగలు కండసుదుములు, నేను నేలలో మా అమ్మ బేంచీలో, ఇది మా నాయినిచ్చిన ఆస్తి, నను తాకేసిందిరా కాలా జాన్వర్, నేరేళ్ల మస్తాన్ సురేష్ నా దేవుడు, నా కోరికలు అట్టా తీర్చినాడు, పోలేరమ్మ బండకాడ మా యిల్లు, మా అమ్మ పూల యాపారం, మా జరినాంటీ స్పెషలు సెలవల కత, ముక్కాలులోనే వుంది మజా అనే సున్తీకత, పల్లెటూరి షాదీలో జజ్జనక, దర్గామిట్టలో రెట్టెల పండగ తీరు, బంగారంగడిలో మన అసిస్టెంటు నౌకరీ, కూటికి పేదైనా కులానికి నవాబునా, తలకాయకూరతో బలే తలకాయనెప్పయినా, చోంగా బుత్తీ షక్కర్ షర్బత్, మా నాయిన ట్రిక్కు నేర్వని కత./ శ్రీదరోళ్ల అక్క శ్రీసుద శ్రీదరు గాడికంటే ఒక సంవచ్చరమో రెండేళ్లో పెద్దది. పొడుగు పొడుగు జడలేసుకొని మనోరంజని పూలుబెట్టుకొని యింట్లో టకా టకా నడస్తా ఉండేది. మేము టెన్తులో ఉంటే ఆమె ఇంటరు. వాళ్లకి కూడా పరీక్షలు ఒకటి రెండు నెలల్లో ఉంటాయి గానీ మా అంత అర్జెంటు కాదు. అయితే మేము నలుగురం కంబైన్డు స్టడీ మొదలెట్టేసరికి శ్రీదరోళ్ల అక్కకి కూడా ముచ్చటేసి ఆమె కూడా కింద వరండాలో ట్యూబులైటు ఏసుకొని చదవడం మొదలు బెట్టింది. సరిగ్గా ఆ పాయింటు కాడ వచ్చింది చిక్కు. శ్రీదరోళ్ల అక్కకి మనసులో చదువుకోవడం రాదు. పెద్దగా చదవాల్సిందే. బవంతులు కూలతాయా, పెంకులు రాలిపోతాయా, చెట్లు అవొంతిన కొమ్మలు యిరుచుకొని మొదళ్లు ఊడపె రుక్కొని కిందపడిపోతాయా అన్నట్టుగా ఓ అంటా ఇంత పెద్ద గొంతుతో ఇంటరు పాటాలు చదవడం మొదలుబెట్టింది శ్రీదరోళ్ల అక్క. మేము లెక్కలు ఏసుకుంటా ఉంటే మధ్యలో శ్రీదరోళ్ల అక్క గొంతు. మేం ఇంగ్లీషు చదవతా ఉంటే శ్రీదరోళ్ల అక్క గొంతు. మేము సైన్సు సోషలులో ఉన్నా శ్రీదరోళ్ల అక్క గొంతే. సచ్చిపోయినాం స్వామీ...

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
342
Publisher
Anvikshiki Publishers

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.