HomeBooksBhagath Singh Oka Samagra Avagahana
తెBhagath Singh Oka Samagra Avagahana

Bhagath Singh Oka Samagra Avagahana

by Bodapatla Ravindar2026184 pagesNava Telangana

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

184

TE

Year

2026

DESCRIPTION

ప్రచురణకర్తల మాట భగత్సింగ్ అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది ఆయన అసమాన సాహసకృత్యాలు. ఆనాటి పార్లమెంటు అయిన సెంట్రల్ అసెంబ్లీలో ఒక చేతిలో పిస్తోలు, మరో చేతిలో బాంబు పట్టుకొని విసిరేసిన సంఘటనే స్ఫురిస్తుంది. 'చెవిటివానికి సైతం వినపడేందుకు' అంటూ కేవలం శబ్దం మాత్రమే చేసే బాంబునే వారు ఉపయోగించారు. 'ఇంక్విలాల్ జిందాబాద్', 'సామ్రాజ్యవాదం నశించాలి' అని గట్టిగా నినదిస్తూ బాంబు విసిరిన భగత్సింగ్, ఆయన సహచరుడు దత్తు అక్కడి నుండి పారిపోలేదు. స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోయారు. అంతేకాదు చేతిలో ఉన్న పిస్తోలును వారు వాడలేదు. దాన్ని చూసి దగ్గరకు వచ్చేందుకు పోలీసులు తటపటాయిస్తుంటే, భగత్సింగ్ దాన్ని పక్కనే ఉన్న టేబుల్ పైన ఉంచాడు. అప్పుడు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇది నిజంగా ఎవ్వరి మదిలోనైనా కలకాలం నిలిచిపోయే దృశ్యమే. పిస్తోలు చేతిలో ఉన్న భగత్సింగ్్న 'రంగ్ దే బసంతి' సిన్మాలో కూడ చూపించాడు. కాని భగత్సింగ్ వ్యక్తిత్వానికి సంబంధించి ఇది పాక్షిక చిత్రణ మాత్రమే. ఆయన దార్శనికత, సామాజిక, రాజకీయ ఆలోచనలు అంతకు మించినవి. భగత్సింగ్, ఆయన సహచరులు కేవలం బ్రిటిష్ వారిని దేశం నుండి పారదోలడానికి మాత్రమే పోరాటం చేయలేదు. పెట్టుబడిదారీ, భూస్వామ్య, వలసవాద వ్యవస్థను అంతం చేసి దాని స్థానంలో సోషలిస్టు సమాజ స్థాపన వైపుకు సాగిపోవాలన్నదే వారి ఆశయం. అందుచేతనే తొలుత హిందూస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్గా ఉన్న వారి విప్లవ సంస్థ పేరును హిందూస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్గా మార్చుకున్నారు. అది కేవలం పేరు మార్పు మాత్రమే కాదు. భగత్సింగ్ అపారమైన అధ్యయనాన్ని అర్ధం చేసుకుంటే ఆయన మేధాశక్తి అవగతమవుతుంది. ప్రత్యేకించి ఆయన జైలు నిర్బంధంలో ఉన్న కాలంలో సమకాలీన సమాజం గురించి, భవిష్యత్ సమాజం గురించి తన అవగాహనను మరింత ప్రగాఢం చేసుకున్నాడు. దళితుల సమస్య గురించి ఆయన ఆనాడే ప్రత్యేకంగా అధ్యయనం చేసి తన అభిప్రాయాలను రూపొందించుకున్నాడంటే ఆయన దూరదృష్టిని................................

Autobiography and Biography

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2026.

Details

Language
te
Year
2026
Pages
184
Publisher
Nava Telangana

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.