HomeBooksAKASAGANAM A NOVEL
తెAKASAGANAM A NOVEL

AKASAGANAM A NOVEL

by Bandi Narayana Swamy2024275 pagesAnvikshiki Books

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

275

TE

Year

2024

ISBN listed

DESCRIPTION

సార్త్రే రెండవది నరకం అంటే, భగవాన్ రమణ మహర్షి, రెండవది భయావహం అంటాడు. ఈవిధంగా అస్తిత్వవాదానికి, ఆధ్యాత్మికతకు మధ్య ఎక్కడో సామీప్యత వుందని అర్థమవుతుంది. రెండవది అంటే అన్యత. మానవుడిని అన్ని పరిమితుల నుంచి అధిగమింపజేసి, శిఖరప్రాయుడిగా, స్వయం సంపూర్ణుడిగా నిలపడమే ఏ తాత్విక సిద్ధాంతానికైనా అంతిమ లక్ష్యం. అస్తిత్వవాదం ఇక్కడే కొంచెం వెనుకబడినట్లుగా తోస్తుంది. సార్త్రే ఎన్నిక చేసుకునే స్వేచ్ఛను వ్యక్తి హక్కుగా గుర్తిస్తాడు. కానీ ఎన్నిక వల్ల కలిగే పరిస్థితులకు, సుఖదుఃఖాలకు వ్యక్తి, బాధ్యత వహించక తప్పదంటాడు. ఇక్కడే ఎగ్జిస్టెన్షియలిజం మానవుడికి సంపూర్ణతను వాగ్దానం చేయలేకపోతుంది. ఇక్కడే జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన 'Be choiceless' తాత్వికత గుర్తుకువస్తుంది. సార్త్రే ఎన్నికచేసుకునే హక్కును స్వేచ్ఛగా గుర్తిస్తే, జిడ్డు కృష్ణమూర్తి choiceless గా వుండటం స్వేచ్ఛగా గుర్తిస్తాడు. అస్తిత్వవాదంలో ఎన్నికచేసుకునే హక్కును సామాజిక స్వేచ్ఛగా అంగీకరించి, దానికి పొడిగింపుగా choiceless ను అస్తిత్వస్వేచ్ఛగా ప్రతిపాదించడం జరిగితే ఎగ్జిస్టెన్షియలిజాన్ని పరిపూర్ణం చేయవచ్చేమో, తాత్వికులు ఆలోచించవలసివుంది. ఈ జిజ్ఞాస వల్లే ప్రధాన పాత్రకు తిరుమలలో కలిగిన ఒక ఆకస్మిక అనుభవాన్ని, ఛాయిస్ లెస్ అనుభవాన్ని పరిచయం చేయవలసివచ్చింది. దాంపత్య ప్రేమను కుటుంబ వ్యవస్థలోని ఇరుకు మరీ మొద్దుబారిచేస్తుంది. అంతమాత్రంచేత హద్దులు లేని స్వేచ్ఛ ఏదో ఒక రూపంలో ప్రేమకు ప్రమాదకరంగా మారబోదనికూడా రూఢిగా చెప్పలేం. కుటుంబ వ్యవస్థలోని ఇరుకుకూ, హద్దులు లేని స్వేచ్ఛకూ ప్రతిగా 'మధ్యమావతి'ని ఆలపించే ప్రయత్నం చేస్తుందీ నవల. ఆ జీవన రాగమే 'being in the boundaries beyond the boundaries'

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
275
ISBN
9789395117654
Publisher
Anvikshiki Books

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.