HomeBooksAhimsa Jyothi
తెAhimsa Jyothi

Ahimsa Jyothi

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

111

TE

Year

2025

DESCRIPTION

సుమారు రెండున్నరవేల సంవత్సరాల క్రితం భారతదేశంలో పదహారు పెద్ద రాజ్యాలూ, అనేక చిల్లర రాజ్యాలూ ఉండేవి, కొన్ని గణతంత్ర రాజ్యాలు కూడా ఉండేవి. పెద్ద రాజ్యాలలో ప్రధానమైనవి కోసల, మగధ, విదేహ రాజ్యాలు. లిచ్ఛవులూ, శాక్యులూ గణతంత్ర రాజ్యాలు ఏర్పరచుకున్నారు. శాక్యుల రాజ్యం హిమాలయాలకు దిగువగా, సుమారు వెయ్యి చదరపు మైళ్లు విస్తీర్ణం కలిగి ఉండేది. శాక్యులు కోసలరాజులకు సామంతులు. కపిలవస్తునగరం వారి రాజధాని, శాక్యుల దేశం చాలా అందమైనది, సారవంతమైనది. దీనికి ఉత్తరాన హిమాలయాల మంచు కొండలుండేవి. దేశమంతటా అందమైన సాలవృక్షాలూ, ఇతర వృక్షాలూ ఉండేవి. మైదానాలలో వరి పుష్కలంగా పండేది. శాక్యులు క్షత్రియులు. వారికి శుద్ధోదనుడు రాజు, శాక్యులు కోసలరాజు కింద సామంతులే అయినప్పటికీ, ఎక్కువ అభిమానం కలవారు; ఒకరికి సులువుగా తల ఒగ్గేవారు కారు. ఒకప్పుడు ఒక కోసలరాజు తనకు భార్యగా ఉండటానికి ఒక శాక్య కన్యను పంపమని కబురు చేస్తే శాక్యులంతా కూడ బలుక్కుని, తమ కన్యలను వివాహమాడటానికి కోసల రాజులు అర్హులు కారని తీర్మానించి, ఒక బానిస పిల్లను పంపారు! ఇందుమూలంగా కోసలరాజు కపిలవస్తును బుద్ధుడి కాలంలోనే కొల్లగొట్టటం జరిగింది. శాక్యులు ఆలాంటి అభిమానధనులు. శాక్యరాజైన శుద్ధోదనుడి పట్టమహిషి మహామాయ, లేక మాయాదేవి. ఆయన రెండవ భార్య మహాప్రజావతి, వీరిద్దరూ వ్యాఘ్రపురరాజు కుమార్తెలు. వీరి గర్భాన ఒక చక్రవర్తి, ఒక అవతార పురుషుడూ జన్మిస్తారని జ్యోతిష్కులు చెప్పటం చేత జంబూద్వీపంలోని అనేక రాజులు వారిని పెళ్లాడగోరారు. కాని వారి తండ్రి వారిని శాక్యరాజైన శుద్ధోదనుడికిచ్చి వైభవంగా వివాహం చేశాడు..................................

Novels

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
111
Publisher
Bala Books Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.