Rating
—
0 votes
Reviews
0
reader takes
Pages
416
TE
Year
2013
—
DESCRIPTION
మధురవాణి - అడివి బాపిరాజు మధురవాణి మంజీరనిక్వాణం శ్రీరామంభువనైక సుందర తనుంధారాధరం శ్యామలం రాజీవాయత లోచనం రఘువరం రాకేందు బింబాననమ్ కోదండాది నిజాయుధాశ్రిత భుజైర్భాంతం విదేహాత్మజా ధీశం భక్తజనాను రంజకపదం శ్రీరామచంద్రం భజే! నాట రాగములో ఆలపిస్తున్న రామకర్ణామృత శ్లోకము వినపడి ఆలయములోనికి వెళ్ళబోవుచున్న ఆ యువకుడు నాట్యమంటపము వైపునకు దృష్టి సారించాడు. ఆ రాగమంటే అతనికెంతో ప్రీతి. అప్పుడే నాట్యారంభమైనట్లున్నది. అతనినెవ్వరూ గమనించుట లేదు. ఒక స్తంభము నానుకుని ఆసీనుడైనాడు. ఆ నర్తకి మోమున భక్తి చంద్రికలు తళతళ లాడుతుండగా శ్రీహరి పాదపద్మములకు పుష్పాంజలి సమర్పించినది. ఆ వెనుక గణాధిపతికిని, నటరాజస్వామికిని, శారదాదేవికిని, మన్నారు దేవునకును, చెంగమలవల్లికిని, దిక్పాలురకును, రంగాధిదేవికిని పూజ సలిపినది. అందెల బంగరు మువ్వలు ఘల్లుఘల్లు మన్నవి. రత్నకింకిణులు కరకంకణములు ఝణంఝణం ఝణ ఝణత్కారములు చేసినవి. ప్రేక్షకుల హృదయమార్దంగికము లొక్కమారుగా ఝల్లుమన్నవి. బృహదీశ్వరాలయ నాట్యమంటపమున ఇంత శోభాయమానముగా జరుగుచున్న కళాసరస్వతీ పూజకు తానేల యాహ్వానింపబడలేదు? ఆ యువకుని హృదయము చిన్నబోయినది, క్షణమాత్రము మరల దృష్టి నాట్యమువైపునకు మళ్ళినది. ఆమె వామపాదముచే వేధమును దక్షిణపాదముచే విక్షేపమును చేయుచు పరివర్తనము ప్రారంభించినది. జయదేవుని అష్టపది, దశావతారములనెంతో చాతుర్యముగా అభినయించుచున్నది. నాట్యశాస్త్రజ్ఞులకా నాట్యము భరతశాస్త్రపు పుటలు తెరిచినట్లుగా అనుభూతి కలిగినది. నాట్యశోభ అంతా అంగసౌష్ఠవము మీదనే ఆధారపడియున్నది. నాతి ఉచ్చములు నాతి కుబ్జములు కానట్టి అంగములు సౌందర్యకారములు. కటికర్ణములొకే రేఖలోను, మోచేతులు భుజములు ఒకే రేఖలోను.................
AUTHOR1 author
CREW2 people
CREATIVE CONTRIBUTORS
Printing & Publishing
Trivia
- ▸Trivia. This edition credits 2 people across 2 roles.
- ▸Released. First cataloged for the year 2013.
Details
- Language
- te
- Year
- 2013
- Pages
- 416
- Publisher
- Navodaya Book House
Reviews0 reviews
Loading reviews…
More like this

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan

Praja Gaanam

